లాక్‌డౌన్ ఆలోచనలొద్దు.. మాస్క్ లేకపోతే ఉతికారేయండి : జగన్

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, కొవిడ్ రూల్స్‌ను సిటిజన్స్ సరిగా పాటించకపోవడం వల్లే కేసులు రెట్టింపుస్థాయిలో పెరుగుతున్నాయని తెలుస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే నమ్మకంతో ప్రజల్లో భయం పోవడమే కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ […]

Update: 2021-04-08 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, కొవిడ్ రూల్స్‌ను సిటిజన్స్ సరిగా పాటించకపోవడం వల్లే కేసులు రెట్టింపుస్థాయిలో పెరుగుతున్నాయని తెలుస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే నమ్మకంతో ప్రజల్లో భయం పోవడమే కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్‌డౌన్ కొనసాగుతోంది.

తాజాగా లాక్‌డౌన్ నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విధించడం వలన ఆర్థికంగా నష్టపోతామని వ్యాఖ్యానించారు. గతేడాది అమలు చేసిన లాక్‌డౌన్ వలన ఏపీకి రూ.21వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా ఫోకస్ పెట్టాలన్నారు. గ్రామాల్లో రోజుకు 4లక్షలు. అర్భన్ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. అయితే, వ్యాక్సినేషన్ డోసులు సరిపడా అందుబాటులో లేవని అధికారులు ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. రోడ్డుపై మాస్కులు పెట్టుకోకుండా విచ్చలవిడిగా సంచరించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News