ఉచిత విద్యుత్‌పై సీఎం జగన్ సమీక్ష
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సోమవారం తాడేపల్లిలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని అవగాహన కల్పించాలని […]
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సోమవారం తాడేపల్లిలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని అవగాహన కల్పించాలని ఆదేశించారు. మీటర్లు ఏర్పాటు చేయడంతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరాను తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చని స్పష్టం చేశారు. 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లను సిద్ధం చేశామన్నారు. ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.