రోగులు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు ఎందుకు పోతున్నారు : సీఎం జగన్

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం జగన్ అమరావతి కేంద్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచించాలని అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, నగరాల్లో హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్కో […]

Update: 2021-05-28 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం జగన్ అమరావతి కేంద్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచించాలని అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, నగరాల్లో హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు కేటాయించాలని జగన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News