ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, విభజన అంశాలు, తాజా పరిస్థితులపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా మూడు రాజధానులు, మండలి రద్దు, కరోనా కట్టడి,పైనా చర్చ జరిగింది. దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో దాదాపు ఎనిమిది నెలల తర్వాత ప్రధానితో జగన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిణామాలు, ఆర్థిక పరిస్థితి, […]

Update: 2020-10-06 00:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, విభజన అంశాలు, తాజా పరిస్థితులపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా మూడు రాజధానులు, మండలి రద్దు, కరోనా కట్టడి,పైనా చర్చ జరిగింది. దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో దాదాపు ఎనిమిది నెలల తర్వాత ప్రధానితో జగన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిణామాలు, ఆర్థిక పరిస్థితి, తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలు, రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ వివాదం వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో చర్చ జరిగింది. ముఖ్యంగా జీఎస్టీ బకాయిలను విడుదల చేయడంతోపాటు.. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు తోడ్పాటునందించాలని ప్రధానిని కోరినట్టు సమాచారం.

Tags:    

Similar News