వచ్చే ఎన్నికల్లోగా సోమశిల ప్రాజెక్టు పూర్తి

దిశ, వెబ్‎డెస్క్: సోమశిల ప్రాజెక్ట్‌ రెండో దశ పనులకు సీఎం జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సోమశిల హైలెవల్ లిఫ్ట్‌కెనాల్ ఫేజ్ -2కు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రూ.460 కోట్ల రూపాయల వ్యయంతో రెండో దశ నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా 46,453 ఎకరాలకు సాగునీరు అందనుంది. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. సోమశిల-కండలేరు కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని.. 2020-21లో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు […]

Update: 2020-11-09 04:05 GMT

దిశ, వెబ్‎డెస్క్: సోమశిల ప్రాజెక్ట్‌ రెండో దశ పనులకు సీఎం జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సోమశిల హైలెవల్ లిఫ్ట్‌కెనాల్ ఫేజ్ -2కు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రూ.460 కోట్ల రూపాయల వ్యయంతో రెండో దశ నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా 46,453 ఎకరాలకు సాగునీరు అందనుంది.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. సోమశిల-కండలేరు కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని.. 2020-21లో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ. 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావుడిగా చేయాలని గత ప్రభుత్వం ఆరాటపడింది. కానీ, ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేసి రూ. 459 కోట్లకు తగ్గించి.. రూ. 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడిందనేది చెప్పేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. పనులను యుద్ద ప్రాతిపదికన మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోగానే సోమశిల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను పూర్తి చేసి జనవరిలో ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు.

Tags:    

Similar News