ఏపీలో సరికొత్త పోలీస్ యాప్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పోలీసు సరికొత్త యాప్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానిస్తూ, ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. దీంతో ప్రజలు పోలీసు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుడా రూపకల్పన చేశామన్నారు. ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా రూపొందించారు. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు, రసీదు కూడా పొందే అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ యాప్ పోలీసు వ్యవస్థలో […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పోలీసు సరికొత్త యాప్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానిస్తూ, ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. దీంతో ప్రజలు పోలీసు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుడా రూపకల్పన చేశామన్నారు. ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా రూపొందించారు. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు, రసీదు కూడా పొందే అవకాశం కల్పించామని వెల్లడించారు. ఈ యాప్ పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు. సోమవారం నుంచే ఈ పోలీస్ యాప్ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు.
Watch 'POLICE SEVA APP' grand launch live streaming at – https://t.co/nIGEX626as#Livestream #PoliceSevaApp #GrandRelease #appolice #AndhraPradeshPolice
— Andhra Pradesh Police (@APPOLICE100) September 21, 2020