వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ కీలక నిర్ణయం
దిశ, ఏపీ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలో జనరల్ బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఒమిక్రాన్ వ్యాప్తిపై అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో […]
దిశ, ఏపీ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలో జనరల్ బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఒమిక్రాన్ వ్యాప్తిపై అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని.. ఆస్పత్రికి వచ్చిన రోగులు సిబ్బంది లేరనే మాట ఎక్కడా అనకూడదని.. అది వినిపించకూడదని సీఎం తెలిపారు. అందువల్ల బదిలీలతోపాటు రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.