అమ్మఒడిపై సీఎం జగన్ కీలక నిర్ణయం

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం ఒకటి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు అమ్మఒడి పథకం కింద లక్షలాది మందికి పథకాన్ని అందించింది. ఈ నేపథ్యంలో పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని తన […]

Update: 2021-10-11 09:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం ఒకటి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు అమ్మఒడి పథకం కింద లక్షలాది మందికి పథకాన్ని అందించింది. ఈ నేపథ్యంలో పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం.. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో చర్చించారు.

సమావేశంలో ప్రధానంగా అమ్మఒడి పథకంపైనే చర్చ జరిగింది. పథకం అమలులో ఇకపై హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరు అనుసంధానం చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 75 శాతం హాజరు ఉండాలని.. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని జగన్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News