మత్స్యకారులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని మత్స్యకారులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను మంగళవారం క్యాంప్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. దీని ద్వారా మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా రూ.10వేల చొప్పున జమ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాజా నిర్ణయంతో 1,19,875 మంది కుటుంబాలకు రూ.119.88కోట్ల సాయం అందినట్లు అయ్యింది. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం వర్తింపజేసినట్లు సీఎం జగన్ గుర్తుచేశారు. పేదలకు మంచి జరగాలనే తపనతో అడుగులు […]

Update: 2021-05-18 01:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని మత్స్యకారులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను మంగళవారం క్యాంప్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. దీని ద్వారా మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా రూ.10వేల చొప్పున జమ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాజా నిర్ణయంతో 1,19,875 మంది కుటుంబాలకు రూ.119.88కోట్ల సాయం అందినట్లు అయ్యింది. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం వర్తింపజేసినట్లు సీఎం జగన్ గుర్తుచేశారు. పేదలకు మంచి జరగాలనే తపనతో అడుగులు వేస్తున్నామన్నారు.

వివక్ష, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.అర్హులైన ప్రతి లబ్దిదారునికీ నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని జగన్ విమర్శించారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆక్వా సాగుచేసే వారి కోసం నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి వేగంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

Tags:    

Similar News