పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
దిశ, ఏపీ బ్యూరో : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో సింధు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా..ఈసారి […]
దిశ, ఏపీ బ్యూరో : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో సింధు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా..ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది.
సీఎం జగన్‌కు పీవీ సింధు తండ్రి కృతజ్ఞతలు..
సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిలకు పీవీ సింధు తండ్రి రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సింధును సీఎం జగన్ అభినందించారని గుర్తు చేశారు. సింధు ఖచ్చితంగా పతకం గెలవాలని జగన్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు పూర్తి సహకారం అందించారని రమణ స్పష్టం చేశారు.