లాక్‌డౌన్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. రోజువారీగా లక్షలాది కేసులు వెలుగు చూస్తుండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. దీనిపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి స్పందించారు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే అస్త్రమని, దీనిపై అధికార యంత్రాంగం మొత్తం దృష్టి సారించాలని జగన్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ లేకుండా […]

Update: 2021-04-17 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. రోజువారీగా లక్షలాది కేసులు వెలుగు చూస్తుండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. దీనిపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి స్పందించారు.

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే అస్త్రమని, దీనిపై అధికార యంత్రాంగం మొత్తం దృష్టి సారించాలని జగన్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎలాంటి లాక్‌డౌన్‌ ఉండదంటూ సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఆర్థిక వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదని.. గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు.. ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News