పోలీస్ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ : జగన్

దిశ, వెబ్‎డెస్క్: పోలీసు ఉద్యోగాల భర్తీకి జనవరిలో షెడ్యూల్‌ జారీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు అని అన్నారు. నాలుగు దశల్లో 6,500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా […]

Update: 2020-10-20 22:29 GMT

దిశ, వెబ్‎డెస్క్: పోలీసు ఉద్యోగాల భర్తీకి జనవరిలో షెడ్యూల్‌ జారీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళులర్పించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు అని అన్నారు. నాలుగు దశల్లో 6,500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చామని.. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించామని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్నారు.

మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు.

Tags:    

Similar News