వారికి ఫోన్ చేసి సీఎం విరాళాలు అడుగుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే బీజేపీకి అంత ఎక్కువ లాభమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు . డబుల్ బెడ్ రూం ఇళ్ల అంశం ప్రాతిపాదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, కరోనా , హైదరాబాద్ వరదలు అన్నింటిలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనడానికి మంత్రి హరీశ్ రావు […]

Update: 2020-10-26 09:03 GMT

దిశ, వెబ్ డెస్క్: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే బీజేపీకి అంత ఎక్కువ లాభమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు . డబుల్ బెడ్ రూం ఇళ్ల అంశం ప్రాతిపాదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, కరోనా , హైదరాబాద్ వరదలు అన్నింటిలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనడానికి మంత్రి హరీశ్ రావు అసహనమే ఉదాహరణ అని ఆయన అన్నారు. దుబ్బాకలో బీజేపీ తరఫున నిరుద్యోగులు ప్రచారం చేయడాన్ని హరీశ్ రావు తట్టుకోలేక పోతున్నారని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదని ఆయన అన్నారు. దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో స్పష్టత లేదని ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలనీ వ్యాపార వేత్తలకు ముఖ్యమంత్రే ఫోన్ చేసి అడుగుతున్నారని తెలిపారు. విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని అడిగినందుకే.. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి త్వరలో విపత్తు నిధులు వస్తాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News