ప్రజలే కేసీఆర్ తొలు ఒలుస్తారు: భట్టి

దిశ, వరంగల్: కరోనా కష్ట కాలంలో జనాలను గాలికొదిలేసినందుకు ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ తోలు ఒలుస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని సీఎల్పీ బృందం వరంగల్ ఎం.జీ.ఎం ఆస్పత్రిని పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల కోసం ఎంజీఎం ఆస్పత్రిని నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. ఈ ఆరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆస్పత్రి అభివృద్ధికి చేసిందేమి లేదని మండిపడ్డారు. ఎర్రబెల్లివా.. […]

Update: 2020-09-02 09:55 GMT

దిశ, వరంగల్: కరోనా కష్ట కాలంలో జనాలను గాలికొదిలేసినందుకు ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ తోలు ఒలుస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని సీఎల్పీ బృందం వరంగల్ ఎం.జీ.ఎం ఆస్పత్రిని పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల కోసం ఎంజీఎం ఆస్పత్రిని నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. ఈ ఆరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆస్పత్రి అభివృద్ధికి చేసిందేమి లేదని మండిపడ్డారు.

ఎర్రబెల్లివా.. ఎర్రపిల్లివా:

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని భట్టి లెక్కలతో సహా వివరించారు. మొత్తంగా ఎంజీఎంలో 651 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయినా.. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఈ ఆరున్నారేళ్లుగా కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. వీటి సంగతి పట్టించుకోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ఎర్రబెల్లా లేక ఎర్రపిల్లివా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News