మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉంది.. భట్టి ఘాటు వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణా శిబిరం నుంచి ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ లను ఓడించాలని, టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యం అని కార్యకర్తలను ఉద్ధేశించి అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. […]

Update: 2021-11-09 06:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణా శిబిరం నుంచి ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ లను ఓడించాలని, టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యం అని కార్యకర్తలను ఉద్ధేశించి అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యం అని తెలిపారు.

దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌దే అని, గాంధీయిజమే కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళు అధికారంలో లేకున్నా, ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ జెండా మోస్తున్న ఘనత కార్యకర్తలదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలతో బురద జల్లుతున్నాయన్నారు.

Tags:    

Similar News