జంట జలాశయాల గేట్లు మూసివేత

దిశ, సిటీ బ్యూరో : మహా నగరవాసుల దాహర్తినీ తీర్చే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను మూసివేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినందున ఈ రెండు రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరింది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో హిమాయత్ సాగర్ ఐదు గేట్లు, ఉస్మాన్ సాగర్ కు చెందిన రెండు గేట్లను ఎత్తి అధికారులు వరద నీటిని […]

Update: 2021-07-26 10:18 GMT

దిశ, సిటీ బ్యూరో : మహా నగరవాసుల దాహర్తినీ తీర్చే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను మూసివేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినందున ఈ రెండు రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరింది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో హిమాయత్ సాగర్ ఐదు గేట్లు, ఉస్మాన్ సాగర్ కు చెందిన రెండు గేట్లను ఎత్తి అధికారులు వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదిలిన సంగతి తెలిసిందే. గడచిన రెండు రోజుల నుండి వర్షాలు తగ్గి, జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి నుండి వచ్చే వరద నీటి ఉద్ధృతి తగ్గటం, పెద్దగా ఇన్ ఫ్లో లేని కారణంగా, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ రెండు జలాశయాల గేట్లను ఆదివారమే మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

నేడు ఈ వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ యొక్క రెండు గేట్లను మధ్యాహ్నం, మరో రెండు గేట్లను ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు మొత్తం ఈ రోజు నాలుగు గేట్లను మూసివేసారు. దీంతో ఇప్పటివరకు ఈ రిజర్వాయర్ ఒకే ఒక్క గేటు ద్వారా 343 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు కాగా, నీటి మట్టం 1761.75 అడుగులకు తగ్గి సాధారణ స్థాయికి చేరినట్లు తెలిపారు. ఇక ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 1786 అడుగులకు తగ్గింది. ఇన్ ఫ్లో 150 క్యూసెక్కులు సాధారణ స్థాయికి తగ్గటం వల్లే గేట్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News