కర్ణాటక సరిహద్దుల మూసివేత

దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని యాద్గిర్‌, రాయిచూరు జిల్లాల్లో ఆదివారం ఒక్కరోజే 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో కర్ణాటక-తెలంగాణ సరిహద్దులను మూసివేశారు. కృష్ణ మండలం గుడేబల్లూర్‌ టైరోడ్‌, చేగుంట, ఎస్కేపల్లీ, ఆలంపల్లి, మాగనూరు మండలంలోని ఉజ్జెల్లి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్‌ మండలంలోని పస్పుల, దత్తాత్రేయ టెంపుల్‌, నారాయణపేట మండలంలోని జలాల్‌పూర్‌, ఎక్లాస్‌పూర్‌, దామరగిద్ద మండలంలోని సజ్జనాపూర్‌, కానుకుర్తి వద్ద చెక్‌పోస్టులు […]

Update: 2020-05-25 10:08 GMT

దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని యాద్గిర్‌, రాయిచూరు జిల్లాల్లో ఆదివారం ఒక్కరోజే 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో కర్ణాటక-తెలంగాణ సరిహద్దులను మూసివేశారు. కృష్ణ మండలం గుడేబల్లూర్‌ టైరోడ్‌, చేగుంట, ఎస్కేపల్లీ, ఆలంపల్లి, మాగనూరు మండలంలోని ఉజ్జెల్లి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్‌ మండలంలోని పస్పుల, దత్తాత్రేయ టెంపుల్‌, నారాయణపేట మండలంలోని జలాల్‌పూర్‌, ఎక్లాస్‌పూర్‌, దామరగిద్ద మండలంలోని సజ్జనాపూర్‌, కానుకుర్తి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీస్‌, వైద్య సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలతో పాటు కాలినడకన వచ్చే వారిని సైతం నిలిపివేస్తున్నారు. దీంతో జలాల్‌పూర్‌, గుడేబల్లూర్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లోనే అనుమతిస్తారని, అనవసరంగా ఎన్‌హెచ్‌-167 పైకి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News