కొవిడ్-19తో బంద్.. కరోనాతో ఓపెన్!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా.. ఈ పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఆర్థిక, వాణిజ్య, వ్యాపాల రంగాలతోపాటు మానవాళిని ఛిన్నాభిన్నం చేసిన వైరస్. నేటికీ దీని ముప్పు తగ్గలేదు. ప్రపంచాన్ని స్తంభింపచేసిన ఈ కొవిడ్-19 వైరస్‌తో అన్ని రంగాలు మూతబడి కుదేలయ్యాయి. మార్చి 23న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి అన్ని రంగాలు మూతపడ్డాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి అమలయింది. రాష్ట్రంలో సినిమా థియోటర్లు సైతం మూతపడ్డాయి. […]

Update: 2020-12-10 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా.. ఈ పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఆర్థిక, వాణిజ్య, వ్యాపాల రంగాలతోపాటు మానవాళిని ఛిన్నాభిన్నం చేసిన వైరస్. నేటికీ దీని ముప్పు తగ్గలేదు. ప్రపంచాన్ని స్తంభింపచేసిన ఈ కొవిడ్-19 వైరస్‌తో అన్ని రంగాలు మూతబడి కుదేలయ్యాయి. మార్చి 23న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి అన్ని రంగాలు మూతపడ్డాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి అమలయింది. రాష్ట్రంలో సినిమా థియోటర్లు సైతం మూతపడ్డాయి. అప్పటి నుంచి ఎంటర్ టైన్మెంట్ ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినా.. థియోటర్లు తెరుచుకోలేదు. ఇటీవలనే మల్టీఫెక్స్‌లు ప్రారంభం అయ్యాయి. వాటి తర్వాత నగరాల్లోని కొన్ని సినిమా టాకీస్‌లు తెరుచుకున్నాయి.

తాజాగా డిసెంబర్ 11 నుంచి అన్ని థియోటర్లలో బొమ్మ పడనుంది. అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ థియేటర్‌లో లాక్‌డౌన్‌ తర్వాత విడుదల అవుతున్న మొదటి సినిమా కరోనా వైరస్. కరోనాతో మూతబడిన టాకీస్ మళ్లీ కరోనా వైరస్ మూవీతో తెరుసుకోవడం విశేషం. కంపెనీ క్రియేషన్స్ పతాకంపై వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ఆగస్త్య మంజు దర్శకుడు. కరోనా సమయంలో ఓ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనే కథాశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్ర పోషించారు.

Tags:    

Similar News