వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. 25 బైకులు ధ్వంసం

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం గొల్లమందలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో 25 బైకులు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు.

Update: 2021-02-22 02:33 GMT

Tags:    

Similar News