వలస కార్మికులకు సీఐటీయూ అపన్నహస్తం
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కరోనా నివారణ చర్యలపై అంకితభావంతో విధులు నిర్వహిస్తూనే వలస కార్మికులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో గత 15 రోజులుగా జాతీయ రహదారి రోడ్డుపైన వలస కార్మికులకు రోజూ భోజనం, అల్పాహారం లేదా పండ్లను అనీస్ బేగం అనే కార్యకర్త అందజేస్తున్నారు. ఆర్మూర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గత మూడు, నాలుగు రోజులు భోజనాలుగా వలస కార్మికులకు హైవే రోడ్డుపైన అందజేస్తూ […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కరోనా నివారణ చర్యలపై అంకితభావంతో విధులు నిర్వహిస్తూనే వలస కార్మికులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో గత 15 రోజులుగా జాతీయ రహదారి రోడ్డుపైన వలస కార్మికులకు రోజూ భోజనం, అల్పాహారం లేదా పండ్లను అనీస్ బేగం అనే కార్యకర్త అందజేస్తున్నారు. ఆర్మూర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గత మూడు, నాలుగు రోజులు భోజనాలుగా వలస కార్మికులకు హైవే రోడ్డుపైన అందజేస్తూ వారిని ఆదుకుంటున్నారు. నిజామాబాద్ ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వర్ణ, అనీస్ బేగం 50 మంది ఆశా కార్మికులకు బియ్యం కూరగాయలను పంపిణీ చేయడంతో పాటు 200 మాస్క్‌లను పంపిణీ చేశారు. డిచ్‌పల్లి ప్రాజెక్టు నాయకురాలు జ్యోతి 100 మాస్క్లను పంపిణీ చేశారు. భీంగల్ ప్రాజెక్టు గుడ్ అధ్యక్షురాలు దేవగంగు అంగన్వాడీ కార్యకర్త 200 మాస్క్‌లను పంపిణీ చేశారు. బోధన్ ప్రాజెక్టు రుద్రూర్, చింతకుంట అంగన్వాడీ కార్యకర్తలు 200 మాస్క్‌లను పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో న్యాల్కల్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త సూర్య కళ 200 మార్కులు అందజేస్తూనే కరోనా వారి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Tags : CITU leaders, distributed, lunch, masks, migrant workers, nizamabad