5జీ కోసం 10 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు : సిస్కో!

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఇప్పటికిప్పుడు 10 కోట్ల మంది 5జీ సేవలను పొందే సామర్థ్యం కలిగి ఉన్నారని, 5జీ కోసం ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారత టెలికాం ఆపరేటర్లు 5జీ మార్కెట్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని నెట్‌ వర్కింగ్ సంస్థ సిస్కో అభిప్రాయపడింది. ‘భారత్‌లో ఇప్పుడు 10 నుంచి 12 శాతం మంది 5జీ సేవలను పొందే సామర్థ్యం కలిగి ఉన్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ డిమాండ్ […]

Update: 2020-12-09 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఇప్పటికిప్పుడు 10 కోట్ల మంది 5జీ సేవలను పొందే సామర్థ్యం కలిగి ఉన్నారని, 5జీ కోసం ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారత టెలికాం ఆపరేటర్లు 5జీ మార్కెట్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని నెట్‌ వర్కింగ్ సంస్థ సిస్కో అభిప్రాయపడింది. ‘భారత్‌లో ఇప్పుడు 10 నుంచి 12 శాతం మంది 5జీ సేవలను పొందే సామర్థ్యం కలిగి ఉన్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ డిమాండ్ టెలికాం కంపెనీలు 5జీ సేవల కోసం పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశంగా కనిపిస్తుందని’ సిస్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ భాస్కర్ చెప్పారు. సిస్కో భారతీయ టెలికాం మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టెలికాం ఆపరేటర్లు, వారి భాగస్వాములకు టెలికాం పరిష్కారాలను అందించడమే కాకుండా కంపెనీలు, పరిశ్రమలకు పరిష్కారాలను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News