Nagarjuna: మా జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకొచ్చావు.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్ ఎవరి గురించంటే?

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) పెళ్లి ఘనంగా జరిగింది.

Update: 2024-12-05 11:00 GMT

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) పెళ్లి ఘనంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో ప్రముఖుల మధ్య వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నాగార్జున ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘శోభిత, చైతు కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చైతుకి అభినందనలు. ప్రియమైన శోభితను కుటుంబంలోకి స్వాగతిస్తున్నాను.

మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. ANR గారి శతజయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ANR గారి విగ్రహం ఆశీర్వాదాలతో ఈ వేడుక జరగడం వలన ఇది మరింత స్పెషల్‌గా మారింది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మాతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News