వామ్మో.. జానీ మాస్టర్ ఒక్క పాటకు అంత రెమ్యునరేషన్ తీసుకుంటాడా?.. అస్సలు ఊహించి ఉండరుగా

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ న్యూస్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-22 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) న్యూస్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడని ఆమె నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో చట్టం(Pocso Act) ప్రకారం కేసు నమోదు చేసి.. గోవాలో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. కాగా కోర్టు జానీ మాస్టర్‌కు 14రోజుల రిమాండ్‌ విధించింది. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ ఒక పాటకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ ప్రస్తుతం ఒక్క పాటకు.. అది కూడా స్టార్ హీరో సినిమా, పెద్ద సినిమా అయితే రూ. 50 లక్షలు తీసుకుంటారట. ఒక సినిమాకు ఆరు పాటలు ఆయనే చేస్తే.. రూ.3 కోట్లు తీసుకోవాల్సిందేనట. కానీ, ఆ పాటకు ఆయన కచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే ఆయన రెండు జాతీయ అవార్డులు సాధించే స్థాయికి ఎదిగారు. అయితే చిన్న సినిమాలకు మాత్రం జానీ మాస్టర్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తారు. ఇక చిన్న సినిమా అయితే పాటకు రూ.10 లక్షలు తీసుకుంటాడట.

కాగా 2009 నితిన్(Nithin) హీరోగా వచ్చిన ‘ద్రోణ’ (Drona)మూవీతో కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన జానీ మాస్టర్.. చాలా సినిమాలకు అసిస్టెంట్‌గా, జూనియర్ డాన్సర్‌గా కూడా చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా తన టాలెంట్ చూపిస్తూ.. పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగి.. స్టార్ హీరోల సినిమాలు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వచ్చాడు.

Tags:    

Similar News