Vishwambhara: చిరంజీవి బర్త్ డే స్పెషల్.. ‘విశ్వంభర’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22, 2024న.. విశ్వంభర మూవీ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా..
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నేడు (ఆగష్టు 22, 2024) ఆయన అభిమానులు, ప్రముఖులు, సెలెబ్రిటీలందరూ విషెస్ తెలుపుతున్నారు. అదే సందర్భంలో చిరు నటిస్తోన్న మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తాయేమోనని చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘యూవీ క్రియేషన్స్’ ఆధ్వర్యంలో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ కూడా శర వేగంగా నడుస్తోంది.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న విశ్వంభర మూవీలో చిరంజీవితోపాటు హీరోయిన్లుగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. కాగా గురువారం ఉదయం మెగాస్టార్ బర్త్ డే నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆ తర్వాత కొన్ని క్షణాలకు మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఏంటంటే.. తాజాగా విశ్వంభర మూవీ నుంచి ఫస్ట్ లుక్ అంటూ మరో పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఇందులో మెగాస్టార్ ఓ ఎత్తైన కొండపై మోకాళ్లపై నిల్చుని, చేతిలో త్రిశూలం పట్టుకొని కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చిరు అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక విశ్వంభర మూవీ సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.