Chiyan Vikram: విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’ రిలీజ్ డేట్ లాక్‌డ్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ఇటీవల ‘తంగలాన్’(Thangalaan) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

Update: 2025-01-08 10:01 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ఇటీవల ‘తంగలాన్’(Thangalaan) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఫామ్‌తో వరుస చిత్రాలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2). ఇది అరుణ్ కుమార్ దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో ఎస్ జే సూర్య(S.J. Surya), సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్(Dushara Vijayan), సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని హెచ్‌ఆర్ పిక్చర్స్(HR Pictures) బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గత ఏడాది విడుదలైనప్పటికీ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. దీంతో థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ‘వీర ధీర శూరన్-2’ ఎప్పెడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. జనవరి 30న ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2) థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News