Thalapathy Vijay: విజయ్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. భారీగా ప్లాన్ చేసిన మూవీ మేకర్స్
గతేడాది ‘ది గోట్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ (Kollywood) స్టార్ మీరో దళపతి విజయ్

దిశ, సినిమా: గతేడాది ‘ది గోట్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ (Kollywood) స్టార్ మీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. ప్రస్తుతం అటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ (Janayagan). హెచ్ వినోథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ (Political thriller) చిత్రంలో.. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, శృతి హాసన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి.
దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు. తాజాగా రిలీజ్ డేట్ (Release date) ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు. ఈ మూవీని వచ్చే ఏడాది పొంగల్ స్పెషల్‌గా అనగా.. 2026 జనవరి 9న రిలీజ్ చెయ్యబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) వచ్చింది. ఇక జనవరి 9 (శుక్రవారం) రిలీజ్ కాగా.. జనవరి 11 (సండే), 13, 14, 15 (పొంగల్ హాలిడేస్), 18, 19 (వీక్ ఎండ్స్) కావడంతో.. ఏం రిలీజ్ డేట్ ప్లాన్ చేశారురా.. ఈసారి దళపతి విజయ్‌తో గట్టిగానే ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.