VidaaMuyarchi: కమింగ్ సూన్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన త్రిష.. సో క్యూట్ అంటున్న ఫ్యాన్స్
తమిళ స్టార్ హీరో అజిత్(Ajith), హీరోయిన్ త్రిష(Trisha) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విదాముయార్చి’(VidaaMuyarchi).
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్(Ajith), హీరోయిన్ త్రిష(Trisha) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విదాముయార్చి’(VidaaMuyarchi). యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మగిళ్ తిరుమేని(Magill Thirumeni) దర్శకత్వం వహిస్తు్న్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో అర్జున్ సర్జా(Arjun Sarja), రెజీనా కాసాండ్రా(Regina Cassandra), ఆరవ్ (Aarav) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘విదాముయార్చి’ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫైనల్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫైనల్ షెడ్యూల్ షూట్ చేస్తున్నట్లు చిత్ర బృందం కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే హీరోయిన్ త్రిష కూడా అజిత్, టీమ్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంటూ ‘త్వరలో రాబోతున్నాము’ అనే క్యాప్షన్ జతచేసింది. ప్రజెంట్ ఈ పోస్టు వైరల్ అవుతుండగా.. అందులో అజిత్, త్రిష జంటను చూసి సో క్యూట్ అని మురిసిపోతున్నారు ఫ్యాన్స్.