Game Changer: హ్యాపీ లైఫ్‌కి మైక్రో మంత్రం.. ఇంట్రెస్టింగ్‌గా ‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి.
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం.
ఇందులో భాంగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టకోగా.. ఇటీవల వచ్చిన ‘నానా హైరానా’ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మరో సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు రామ్ చరణ్ తన X ఖాతా ద్వారా సెకండ్ సింగిల్ (Second Single) ప్రోమోను రిలీజ్ చేశాడు. ‘హ్యాపీ లైఫ్‌కి మైక్రో మంత్రం.. డిసెంబర్ 22న మీ ముందుకు వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ‘సరస్వతీపుత్ర’ (SaraswathiPuthra) అనే లిరిక్‌తో సాగిన ఈ ప్రోమో మాస్ బీట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Say #Dhop ! 😊
— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024
The happy life ki micro mantra will see you from 22nd December!
A @MusicThaman Musical🎶
Lyrics "SaraswathiPuthra" @ramjowrites @Lyricist_Vivek #RaqueebAlam#GameChanger#GamechangerOnJAN10 @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @AlwaysJani… pic.twitter.com/B0hh01sH0p