Prasad Behera : యూట్యూబ్ ప్రముఖ నటుడు ప్రసాద్ బెహెరా అరెస్ట్

యూట్యూబ్ ప్రముఖ తెలుగు నటుడు ప్రసాద్ బెహెరా(Prasad Behera)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-18 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : యూట్యూబ్ ప్రముఖ తెలుగు నటుడు ప్రసాద్ బెహెరా(Prasad Behera)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ తనను కొద్ది నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని, షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని, తనను బాడీ షేమింగ్ చేస్తున్నాడని వెబ్ సిరీస్ నటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఈనెల 14న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్.. తాజాగా కమిటీ కుర్రాళ్ళు(Kamiti Kurrallu) సినిమా తీసి విజయం సాధించాడు.

Tags:    

Similar News