కొత్త సినిమా ప్రకటించిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఆసక్తికరంగా మారిన ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) గత ఏడాది మొత్తం వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) గత ఏడాది మొత్తం వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. లావణ్య(Lavanya) అనే అమ్మాయి తనను ప్రేమించి మోసం చేశాడని ఆమె కేసు పెట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన గత ఏడాది పురుషోత్తముడు(Purushothamudu), తిరగబడర సామి(Thiragabadara Saami) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
కొంచెం కూడా గ్యాప్ లేకుండా వరుస చిత్రాలు ప్రకటిస్తున్నాడు. నేడు నూతన సంవత్సరం కావడంతో కొత్త సినిమా ‘పాంచ్ మినార్’(Paanch Minar)తో రాబోతున్నట్లు పోస్ట్ పెట్టాడు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ఇందులో రాజ్ తరుణ్ కారుపై పడుకుని ఉండగా.. డిక్కీలో మొత్తం డబ్బుల కట్టలు కనిపించాయి. అయితే దీనికి గోవింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా త్వరలో థియేటర్స్‌లోకి రానుంది.