Nayanthara: ప్రముఖ డైరెక్టర్‌తో నయనతారకు గొడవ.. అసలు విషయం చెప్తూ నటి ఆసక్తికర పోస్ట్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara)అందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ బిరుదును దక్కించుకుంది.

Update: 2025-03-26 03:56 GMT
Nayanthara: ప్రముఖ డైరెక్టర్‌తో నయనతారకు గొడవ.. అసలు విషయం చెప్తూ నటి ఆసక్తికర పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara)అందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ బిరుదును దక్కించుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుతి అమ్మన్-2’ (Mookuthi Amman 2) (అమ్మోరు తల్లి-2). ఆ సినిమా సుందర్. సి దర్శకత్వంలో రాబోతుంది. ఈ మూవీ 2020లో విడుదలై ఘన విజయం సాధించిన ‘అమ్మోరు తల్లి’కి సీక్వెల్‌గా రాబోతుంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంతో పాటు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి నయనతారకు, అసిస్టెంట్ డైరెక్టర్‌కు గొడవలు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. షూటింగ్ మధ్యలో ఇలా జరగడంతో సినిమానే ఆపేస్తున్నారనే చర్చ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై నటి ఖుష్బూ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘మూకుతీ అమ్మన్-2 సినిమాపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దయచేసి ఆ రూమర్స్ సృష్టించేవాళ్లు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఈ సినిమా షూటింగ్ సజావుగానే సాగుతోంది. అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోంది. ఇలాంటి రూమర్స్‌ను సుందర్ అస్సలు పట్టించుకోరని అందరికీ తెలుసు. నయనతార చాలా గొప్ప నటి. గతంలో ఆమె చేసిన పాత్రను ఇప్పుడు మరోసారి పోషిస్తుంన్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాపై ఇలాంటి నిరాధారమైన రూమర్స్ సృష్టించకండి. ‘అమ్మోరు తల్లి’మూవీపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. సుందర్. సి నుంచి మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూడండి’’ అని రాసుకొచ్చింది. దీంతో నయనతార వివాదంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది.

Tags:    

Similar News