Viral video: మెగాస్టార్ చిరంజీవి ఓ దుర్మార్గుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ హీరో
JD Chakravarthy: జేడీ చక్రవర్తి. ఈ హీరో అందరికీ తెలిసే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: JD Chakravarthy: జేడీ చక్రవర్తి. ఈ హీరో అందరికీ తెలిసే ఉంటుంది. గులాబీ చక్రవర్తి అందరికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే జెడీ చక్రవర్తి నటించిన గులాబీ అప్పట్లో ఓ సెన్సెషనల్ క్రియేట్ చేసింది. ఇక జేడీ చక్రవర్తి ఓ మెగా అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి అంటే జేడీ చక్రవర్తికి పిచ్చి ఇష్టం. ఆర్జీవీ గ్యాంగులో జేడీ చక్రవర్తి ఉన్నప్పటికీ ..అతని ధోరణి మాత్రం మరోలా ఉంటుంది. ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరిచే విధానం అచ్చం ఆర్జీవీ మాదిరే ఉంటుంది. అయితే జేడీ చక్రవర్తికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎంత కష్టపడతాడు అని చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్పాడు.
చిరంజీవి ఎంత కష్టపడుతాడని చెప్పేందుకు ఎంతో మంది ఎన్నో సార్లు తమ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కానీ జేడీ చక్రవర్తి చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఘరానా మొగుడు మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఘటన గురించి చెప్పుకొచ్చాడు. వారంకు పైగా రోజూ షూటింగ్ జరుగుతోంది. అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ చిరంజీవి మాత్రం అలానే షాట్ అయ్యాక పక్కనే ఉన్న అంబాసిడర్ కార్లు పడుకున్నాడు.
అప్పట్లో కేరవ్యాన్లు లేవు. మేకప్ రూమ్ లోనే పడుకుంటారు. ఇలా కార్లో ఎందుకు పడుకున్నావంటూ ఓ అభిమానిగా ఉండలేక అడిగాను. మీరు ఎందుకు ఇక్కడ పడుకుంటున్నారు అని అంటే నేను ఒకవేళ మేకప్ రూంలో రెస్ట్ తీసుకుంటే నన్ను చిత్రయూనిట్ పిలవదు. అందుకే ఇక్కడ పడుకుంటున్నాను..ఇక్కడ ఉంటే డైరెక్టర్ షాట్ రెడీ అంటే అది నాకు వినిపిస్తుంది..నేను వెంటనే వెళ్లొచ్చు అని చెప్పాడు. అంత పని రాక్షసుడు, దుర్మార్గుడు అంటూ చిరంజీవి పడే కష్టం గురించి గొప్పగా చెప్పాడు జేడీ చక్రవర్తి. జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటలను మెగా ఫ్యాన్స్ బాగానే వైరల్ చేశారు.
Read More..
మంచు ఫ్యామిలీ వివాదం.. ఈ సారి అక్కడ చూసుకుందాం అంటూ అన్నకు మనోజ్ వార్నింగ్!