The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ
నేచురల్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: నేచురల్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దీనిని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. కేవలం పోస్టర్‌తోనే ఓవర్ హైప్ క్రియేట్ చేసుకున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం 2026 మార్చి 26న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, స్పానిష్ భాషల్లో విడుదల కాబోతుందని ఇప్పటికే ప్రకటించారు చిత్ర బృందం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ (Interesting news) వినిపిస్తుంది. ఈ చిత్రంతో నాని సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. మేకర్స్ ఇప్పటికే కథ హీరోయిన్‌కు వివరించగా.. ఈ బ్యూటీ కూడా ఓకే చేసిందట. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వనున్నారట మేకర్స్. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. కృతి శెట్టి బంపర్ ఆఫర్ అందుకుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.