పెళ్లైన 12 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. డెలివరీ తర్వాత మొదటి వర్క్ అంటూ పోస్ట్

హీరోయిన్ రాధిక ఆప్టే గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ప్రకాష్ రాజ్ చేసిన ధోనీ, బాలయ్య లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది.

Update: 2024-12-14 04:37 GMT

దిశ, సినిమా: హీరోయిన్ రాధిక ఆప్టే గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ప్రకాష్ రాజ్ చేసిన ధోనీ, బాలయ్య లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి భాషా చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఈ భామ న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో కూడా నటించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. రాధిక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2012లో బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌తో ఏడడుగులు వేసింది. అయితే పెళ్లైన 12 ఏళ్ళ తర్వాత ఈ భామ అమ్మ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తు ఆమె ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో బిడ్డకు పాలిస్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న ఫొటోను ఆమె పంచుకున్నారు. అంతే కాకుండా.. ‘నా వన్ వీక్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ.. నేను డెలివరీ తర్వాత చేస్తున్న మొదటి వర్క్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బేబీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

Full View

Tags:    

Similar News