‘బచ్చల మల్లి’ సినిమా చూశాకా నరేష్‌ని అలా పిలుస్తారు.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అల్లరి నరేష్ హీరోగా, డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బచ్చల మల్లి’.

Update: 2024-12-14 06:27 GMT

దిశ, సినిమా: అల్లరి నరేష్ హీరోగా, డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బచ్చల మల్లి’. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బచ్చల మల్లి సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ బిజీలో ఉన్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత రాజేష్ దండా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ‘ ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 1980 బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. లైఫ్‌లో తప్పులు చేయొచ్చు. కానీ, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం. ఇది క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్‌లో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు. ఈ మూవీ చూసి ఇది నరేష్ 2.O అని ఫీల్ అవుతారు. క్యారెక్టరైజేషన్. లవ్, స్టోరీ, ఎమోషన్స్.. ఇవన్నీ ప్రేక్షకులను కనెక్ట్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News