Kiara Advani: ‘అవి మన విజయానికి మార్గం కాదు’.. కియారా అద్వానీ కీలక వ్యాఖ్యలు

యంగ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘భరత్ అనే నేను’ అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫస్ట్ సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.

Update: 2025-01-08 02:57 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘భరత్ అనే నేను’ అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫస్ట్ సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరులో ఉన్నారు చిత్రబృదం. ఈ క్రమంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అక్కడ సినీ కెరీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో స్థిరపడడం అంత సులభమైన విషయం కాదు. పరిశ్రమలో మనకు తెలిసిన వ్యక్తులు ఎంతో మంది ఉండొచ్చు. కానీ, ఆ సంబంధాలు వేరే వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలోని ప్రతిభావంతుల్ని కలిసే అవకాశాలను సులభతరం చేస్తాయి.

అంతేకానీ అవి మన విజయానికి మార్గం కాదు. సినిమా ఆఫర్‌లు కూడా రావు. అప్పుడు అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. ఎక్కువమంది దర్శకులు నటీనటుల మునపటి సినిమాల ఫలితాన్ని దృష్టిలో ఉంచుకునే చిత్రంలో నటించే అవకాశం ఇస్తుంటారు. మరికొంత మంది స్టార్స్‌కి బదులుగా కొత్త ఫేస్‌లను స్క్రీన్‌పై చూపించడానికి ఆసక్తి చూసిస్తారు’ అని చెప్పుకొచ్చింది కియారా అద్వానీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News