‘పుష్ప-2’ పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు’.. మరోసారి స్పందించిన సీనియర్ నటుడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2 Movie) మూవీ పై టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-08 11:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2 Movie) మూవీ పై టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఇటీవల పుష్ప-2 మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ మూవీ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే దొంగ అంటూ’ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. దీంతో తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మరోసారి రాజేంద్రప్రసాద్ ఇదే విషయంపై తాజాగా స్పందించాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుష్ప-2 లో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. నేను ఇటీవ‌ల అల్లు అర్జున్‌(Allu Arjun)ని క‌లిశాను. ఈ క్రమంలో బన్నీ.. మీరు ఆ మాటలు అన‌లేద‌ని నాకు తెలుసు అన్నాడు. కానీ బన్నీకి నేనే అన్నానని చెప్పాను. అప్పుడు బన్నీమీరు అన్న‌ది వేరే ఉద్దేశ్యంతో కాదు అని తెలిపాడు. స‌రిగ్గా చెప్పావు. నా ఉద్దేశ్యం అది కాదు. నేను నాకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని నేను మాట్లాడింది ఒకటి అయితే నువ్వు టైటిల్ వేరే ఎందుకు పెట్టావు అడిగాను. అప్పుడు అలా ధంబ్‌నెల్స్ లేక‌పోతే ఎవ‌రు చూడ‌ట్లేద‌ని తెలిపాడు. ఇలా చేయ‌డం వ‌ల‌న తెలికుండానే నెగిటివ్‌గా పోతున్నాయని.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని వేరే ఉద్దేశంతో చూడొద్దని’’ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

Read More ...

అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన బన్నీ భార్య.. ఆల్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ..


Tags:    

Similar News