Thandel: ‘తండేల్’ సెకండ్ సింగిల్‌పై అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్స్
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అయిన బుజ్జి తల్లి అనే పాట.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలో తాజాగా సెకెండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మేరకు సాయి పల్లవి, నాగ చైతన్య శివ పార్వతుల స్టిల్‌లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘శాశ్వతమైన జంట అయినటువంటి శివశక్తి మధ్య ప్రేమ స్వచ్ఛమైన రూపాన్ని జరుపుకోవడానికి ఒక పాట - ఇది ప్రతి యుగంలో కాల పరీక్షగా నిలిచింది. తండేల్ రెండవ సింగిల్ శివశక్తి అనే సాంగ్ డిసెంబర్ 22న కాశీలోని దివ్య ఘాట్‌లలో తెలుగు, హిందీ & తమిళ భాషల్లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది’అని రాసుకొచ్చారు. కాగా దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.