Janhvi Kapoor: ఈ సినిమా నా హృదయాన్ని కదిలించింది.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయిపల్లవి(Sai Pallavi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran).

Update: 2024-12-31 09:09 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్(Sivakarthikeyan), సాయిపల్లవి(Sai Pallavi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran). ఈ సినిమాకు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా దీనిని రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇటీవల అమరన్ ఓటీటీలోకి కూడా వచ్చి సినీ ప్రియులను అలరిస్తోంది.

ఇక ఈ సినిమాను చూసిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా, అమరన్ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యమైంది. కానీ ఇందులోని ప్రతి సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. ఈ ఏడాదికి ఇదే బెస్ట్ మూవీ. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. అమరన్ నా హృదయాన్ని కదిలించింది. ఇందులోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి’’ అని రాసుకొచ్చింది.

 

Tags:    

Similar News