‘కాదలిక్క నేరమిల్లై’ మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదల.. మాస్ లుక్‌లో నిత్యామీనన్
కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi), నిత్యామీనన్(Nithya Menon) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాదలిక్క నేరమిళ్లై’(KadhalikkaNeramillai) .
దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi), నిత్యామీనన్(Nithya Menon) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాదలిక్క నేరమిళ్లై’(KadhalikkaNeramillai) . ఈ సినిమాను కిరుతిగ ఉదయనిధి(Kirutiga Udayanidhi) తెరకెక్కిస్తున్నారు. ఇందులో యోగిబాబు(Yogi Babu), లాల్, వినయ్ రే, లక్ష్మి రామకృష్ణన్, మనో, టిజె బాను, జాన్ కొక్కెన్, వినోదిని కీలక పాత్రలో నటించారు. అయితే దీనికి ఏఆర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్(Red giant) మూవీస్ బ్యానర్‌పై ఎం శెంబగ మూర్తి, ఆర్ అర్జున్ దురై నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కాదలిక్క నేరమిళ్లై’ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ హైప్ పెంచుతున్నాయి. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్స్‌లోకి రానుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ఇందులోంచి థర్డ్ పాటను విడుదల చేశారు. ‘ఇట్స్ బ్రేకప్ దా’ అనే సాగే సాంగ్‌లో నిత్యామీనన్ పెద్ద సుత్తి పట్టుకుని గాగూల్స్ పెట్టుకుని మాస్ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.