Akshay Kumar: యుద్దానికి సిద్ధమైన అక్షయ్ కుమార్.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘స్కై ఫోర్స్’ ట్రైలర్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Update: 2025-01-05 08:52 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan), సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఓ క్రేజీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్షయ్, వీర్ పహరియా(Veer Pahariya) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. దీనిని సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్(Abhishek Kapoor) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని జియో స్టూడియోస్(Jio Studios), మడాక్ ఫిల్మ్స్(Maddock Films) బ్యానర్స్‌పై దినేష్ విజన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇందులో సారా అలీ ఖాన్(Sara Ali Khan), నిమ్రత్ కౌర్(Nimrat Kaur) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతదేశ మొదటి వైమానికి దాడి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, ‘స్కై ఫోర్స్’ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. పాకిస్థాన్‌పై యుద్ధం చేస్తాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్లు వారి ట్రైన్స్, కంపెనీలు దగ్దం చేసి యుద్ధంలో విజయం సాధిస్తాడు. కానీ కుటుంబాన్ని వదిలేసి పోరాటంలో చనిపోయిన ఓ ఆఫీసర్ కేసును మాత్రం చేధించడం మర్చిపోతాడు. ప్రస్తుతం ‘స్కై ఫోర్స్’ ట్రైలర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.


Full View

Tags:    

Similar News