ఆ సినిమాకు మా అమ్మమ్మతో కలిసి వెళ్లాను.. పవన్ కల్యా్ణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-05 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన అందరినీ తలుచుకోవాలని అన్నారు. తెలుగు సినిమాకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, నాగిరెడ్డి, బీఎన్ రెడ్డి, రామబ్రహ్మం, ఎన్టీ రామారావు, ఏఎన్నార్‌ల వల్లే మనం ఈస్థాయిలో ఉన్నామని అన్నారు. ‘శంకర్(Shankar) చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు మా అమ్మమ్మతో కలిసి వెళ్లాను.

సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ ఒకరు. తమిళంలో శంకర్ సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇక దిల్ రాజు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా పనిచేశాయి’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News