‘సికందర్’ ఫైనల్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడ జరగనుందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ అని భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఈ అమ్మడు ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ‘సికందర్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.
ఇందులో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ చిత్రం ఈద్ సందర్భంగా మార్చిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల ‘సికందర్’ టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘సికందర్’(Sikander) మూవీ ఫైనల్ షెడ్యూల్ జనవరి 10న ముంబైలో జరగనున్నట్లు సమాచారం. ఇందులో సల్మాన్, రష్మిక మధ్యలోని కొన్ని సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The final shoot of #Sikandar begins on January 10th in Mumbai.
— Movie Tamil (@MovieTamil4) January 6, 2025
March Month Release 🔒 #SalmanKhan | #RashmikaMandanna | #SK23 pic.twitter.com/01mxWYmyBh