Thaman: ‘రాజాసాబ్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రాజా సాబ్’ ఒకటి.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రాజా సాబ్’ ఒకటి. మారుతీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రాజాసాబ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్‌లో చేయబోతున్నాము. అందుకనే జపనీస్ వెర్షన్‌లో ఓ సాంగ్ చేయాలని చిత్రబృందం కోరారు. అలాగే ఈ మూవీలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉన్నాయి. అయితే ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు తమన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌తో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది.