Director Shankar: పవన్ కళ్యాణ్ ఎంత గొప్పోడో చెప్పడానికి ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు

గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

Update: 2025-01-05 09:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ హీరోగా " గేమ్ ఛేంజర్ " మూవీ జనవరి 10 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం, ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన మాటలతో పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ముందు మాట్లాడిన స్పీచ్ లో నేను మరిచిపోయానంటూ .. రెండో సారి మైక్ తీసుకున్న శంకర్ ఏం మాట్లాడాలో కూడా మరిచిపోయానంటూ కామెంట్ చేశారు.

" నా కూతురు పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాను. ఆ టైం లో ఎంతో గౌరవం, ఎంత మంచి సంస్కారం .. నేను ఆయన్ని చూడగానే ఇంప్రెస్ అయిపోయాను. ఒక మాటలో చెప్పాలంటే హృదయాలను మాత్రమే చూసే ఏకైక వ్యక్తి పవన్ ఒక్కరే. అలాంటి మనిషి ఈ " గేమ్ ఛేంజర్ " ఫంక్షన్ కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థాంక్స్ చెప్పుకుంటున్నానంటూ" శంకర్ మాట్లాడారు.

Tags:    

Similar News