యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘బుజ్జితల్లి’ సాంగ్.. మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘తండేల్’(Thandel ).

Update: 2024-12-30 13:35 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘తండేల్’(Thandel ). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తుండగా.. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘తండేల్’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో తెలుగు, తమిళ, మలయాళంలో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా ‘తండేల్’ నుంచి వచ్చిన ‘బుజ్జి తల్లి’ సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ఈ పాట ఓ క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా40 మిలియన్ల వ్యూస్ సాధించి అరుదైన ఘనత సాధించింది. 

Tags:    

Similar News