అర్జున్ రెడ్డి సినిమా కంటే మరింత బోల్డ్‌గా చేస్తా.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించగా.. షాలిని ప్రీతి పాత్రలో యూత్‌ను ఆకట్టుకుంది. 2017లో వచ్చిన ఈ మూవీ ఎంతో మందిని ఆకట్టుకోవడంతో పాటు పలు విమర్శలు కూడా ఎదుర్కోంది. ఇందులో షాలిని పాత్ర చాలా వీక్‌గా ఉందని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని ‘అర్జున్ రెడ్డి’ సినిమా లాంటి ఆఫర్ మరోసారి వస్తే చేస్తారా అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘నేను సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో నటించిన మూవీ అది. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తోంది. అందులో నా పాత్రను మరింత బలంగా చేయొచ్చేమోనని అనుకుంటున్నా.. మరోసారి అలాంటి పాత్ర వస్తే.. ఖచ్చితంగా నో అయితే చెప్పను. కానీ, దానిపై మరింత అవగాహన పెంచుకొని నటిస్తాను. అంతేకాదు అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణితి చెందాను కాబట్టి భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను. నిజాయతీగా చెప్పాలంటే దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని సినిమాకు ఓకే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ హీరోయిన్ తాజాగా ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel)అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కు హితేశ్ భాటియా(Hitesh Bhatia) దర్శకత్వం వహించగా.. ప్రజెంట్ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.