Chaurya Patham: ‘చౌర్య పాఠం’ నుంచి ‘ఆడ పిశాచం’ వచ్చింది.. మీరు కూడా చూడండి

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinath Rao Nakkina) ‘చౌర్య పాఠం’(Chaurya Patham)తో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు

Advertisement
Update: 2025-03-19 16:06 GMT
Chaurya Patham: ‘చౌర్య పాఠం’ నుంచి ‘ఆడ పిశాచం’ వచ్చింది.. మీరు కూడా చూడండి
  • whatsapp icon

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinath Rao Nakkina) ‘చౌర్య పాఠం’(Chaurya Patham)తో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. క్రైమ్-కామెడీ (Crime-comedy) డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అలాగే హిట్ డైరెక్టర్ చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ టెర్రిఫయింగ్ నెంబర్ ‘ఆడ పిశాచం’ (Aada Pishacham) సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో లీడ్ కాస్ట్ ప్రజెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కాగా.. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఏంటంటే ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. సమ్మర్‌లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.

Tags:    

Similar News