Shobha Shetty: ‘నన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేయండి’.. బోరున ఏడ్చేసిన శోభాశెట్టి (వీడియో)
రియాలిటీ షో బిగ్‌బాస్ షో(Bigg Boss Show) అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.
దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ షో(Bigg Boss Show) అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తెలుగులో సీజన్ 8 కొనసాగుతుండగా.. ఇక కన్నడ(Kannada)లో 11వ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభమై 50 రోజులకు పైగానే అయింది. అయితే ఇందులో ‘కార్తీక దీపం’ (Karthika Deepam)మేనిత అలియాస్ శోభా శెట్టి(Shobha Shetty) కూడా కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లింది. అలాగే రజత్ అనే మరో కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక శోభా శెట్టి విషయానికొస్తే.. మొదట ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
ఇక శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో తనను బయటకు పంపించేయమని హోస్ట్ అయిన కిచ్చా సుదీప్(Kiccha Sudeep)కు చెప్తూ శోభా బోరున ఏడ్చేసింది. దీంతో ఆయన ఒకసారి ఆలోచించుకో అన్నాడు. అయినా సరే శోభాశెట్టి(Shobha Shetty) తాను బయటకు వెళతానని చెప్పింది. దీంతో కిచ్చా సుదీప్ తలుపులు తెరిపించాడు. అంతటితో ఆ ప్రోమో పూర్తయింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు అసలు శోభాకు ఏం కష్టం వచ్చిందోనని ఆందోళన చెందుతున్నారు.
ಸೂಪರ್ ಸಂಡೇ ವಿತ್ ಬಾದ್ಷಾ ಸುದೀಪ | ಇಂದು ರಾತ್ರಿ 9 #BiggBossKannada11 #BBK11 #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa #BBKPromo pic.twitter.com/ypkz2sfD2t
— Colors Kannada (@ColorsKannada) December 1, 2024