‘మాది ఎగువ మధ్యతరగతి కుటుంబం’.. ఆ సంఘటనపై హీరో ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-12-13 07:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు చిత్రాలతో పాటు కోలీవుడ్‌‌ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. విభిన్నమైన స్టోరీలతో జనాలకు దగ్గర అవుతున్నాడు. తాజాగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూకు హాజరై.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకొచ్చారు. తనది ఎగువ మధ్యతరగతి ఫ్యామిలీ అని తెలిపాడు. కాలేజీ డేస్‌లో ఎక్కువగా మూవీస్ చూసేవాడినని.. దీంతో సిని రంగంలోకి రావాలనే కోరిక తనలో కలిగిందని వెల్లడించాడు. కానీ స్టార్టింగ్ కుటుంబీకులు ఒప్పుకోలేదని అన్నాడు. చివరకు తన అమ్మ అర్థం చేసుకుని 25 వేల రూపాయలిస్తే.. వాటితో ఫొటోషూట్ చేయించానని పేర్కొన్నాడు. తర్వాత డైరెక్టర్ గౌతమ్ మేనన్(Directed Gautham Menon) దగ్గర అసిస్టెంట్ దర్శకుడి(Assistant Director)గా చేరానని అన్నాడు.

కొన్ని సినిమాలకు ఆడిషన్స్ కు కూడా వెళ్లానని.. కానీ ఆ పాత్రలకు నేను సెట్ కాకపోవడంతో అవకాశం రాలేకపోయిందని చెప్పుకొచ్చాడు. ఇలా రెండు సంవత్సరాలు కష్టపడ్డానని.. ఆఫర్లు రావడం చేజారిపోవడం జరిగిందని తెలిపాడు. అలాగే స్నేహగీతం(Sneha Geetham) మూవీ చిత్ర షూటింగ్ సమయంలో నాన్న తన వద్దకు వచ్చాడని వెల్లడించారు. అప్పుడు అందరం కలిసి తింటున్నప్పుడు.. నాన్న ప్లేట్‌లో చికెన్ అయిపోతే.. సర్ప్ చేసే అతడ్ని పిలిచి చికెన్ పెట్టమని అడిగానని అన్నాడు. దీంతో ఆ వ్యక్తి చికెన్ కొంచమే ఉందని.. అందరికీ సరిపోవాలన్నారని తెలిపాడు. దీంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించిందని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటినుంచి పేరెంట్స్‌ను సెట్‌కు రానివ్వనని.. వాళ్లు వచ్చినా.. పావుగంటకంటే ఎక్కువ సేపు అక్కడ ఉంచనని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News